![]() |
![]() |

రష్మీ గౌతం ప్లేస్ లో కొత్త యాంకర్ వచ్చేసరికి ఇక రష్మీ మీద ట్రోల్స్, మీమ్స్ మాములుగా లేవు. 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో హైపర్ ఆది కూడా రష్మీ మీద సెటైర్లు పేల్చాడు. ఆదివారం ప్రసారమైన 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో హైపర్ ఆది, నాటీ నరేష్ జాతకం చెప్పేవాళ్ల గెటప్ లో వచ్చారు. కమెడియన్స్ అందరి చేతి రేఖలు చూసి జాతకం చెప్పి మంచి ఫన్ క్రియేట్ చేశారు.
వీళ్ళతో పాటు రష్మీ కూడా వచ్చి చెయ్యిచ్చి ధనరేఖ ఎలా ఉందో జాతకం చెప్పమంది. "చేతిలో గీతల కంటే ముడతలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ధన రేఖ విషయానికి వస్తే ఇప్పుడు తగ్గింది. అదే గురువారం కూడా యాడ్ ఐతే ధనరేఖ బాగా పెరుగుతుంది" అని చెప్పాడు ఆది.
ఇక బులెట్ భాస్కర్ జాతకం చెప్తూ "ఆయష్షు రేఖ ఆ ఈవెంట్లకు, ఈ ఈవెంట్లకు వెళ్లి ఆరేళ్ళు తగ్గిపోయింది." అని చెప్పాడు. దొరబాబు జాతకం గురించి చెప్తూ నీ జాతకం చూడడం కంటే ముందు నా జాతకం నేను చూసుకోవడం బెస్టు" అన్నాడు. "నువ్వు పుట్టినప్పుడు మీ నాన్నే నీ జాతకం చూడలేదనుకుంటా. అందుకే దొరబాబు అని పేరు పెట్టాడు. చూసి ఉంటే 'దొరుకుతాడు బాబు' అని పేరు పెట్టేవాడు" అని కౌంటర్ వేసి ఫన్ చేసాడు. ఇలా అందరి జాతకాలు చెప్పి ఎంటర్టైన్ చేసాడు ఆది.
![]() |
![]() |